(శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు) Sri Krishna Janmashtami Vasudeva Sutam Devam Slokam Lyrics with Meaning in Telugu History - All Top Quotes | Telugu Quotes | Tamil Quotes | English Quotes | Kannada Quotes | Hindi Quotes

Latest Quotes

Wednesday, 24 August 2016

(శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు) Sri Krishna Janmashtami Vasudeva Sutam Devam Slokam Lyrics with Meaning in Telugu History

Sri Krishna Janmashtami Vasudeva Sutam Devam Slokam Lyrics with Meaning in Telugu: Sri Krishna Janmashtami Vasudeva Sutam Devam Slokam Lyrics with Meaning in Telugu, Sri Krishna Janmashtami songs download, Sri Krishna Janmashtami mp3 songs for free, Sri Krishna Janmashtami quotes slokas in telugu, Sri Krishna Janmashtami wishes with lord krishna nemali pincham flute, Sri Krishna Janmashtami wallpapers. 
Click here for more Sri Krishna Janmashtami Telugu Quotes

Sri Krishna Janmashtami Vasudeva Sutam Devam Slokam Lyrics with Meaning in Telugu History

vsri-krishna-janmashtami-vasudeva-sutam-devam-slokam-lyrics-with-meaning-in-teluguasudeva-sutam-devam-slokam-lyrics-with-meaning-in-telugu

Sri Krishna Janmashtami History in Telugu language:


కృష్ణ జన్మాష్టమి (సంస్కృతం: कृष्ण जन्माष्टमी) శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

తిథి
---
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారము 2006 సంవత్సరములో ఆగష్టు నెల 15-16 తారీఖులలో వచ్చింది. 2007 సంవత్సరములో సెప్టెంబర్ నెల 4వ తారీఖున వచ్చింది

కృష్ణాష్టమి పండుగ విధానం
----------------
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.

పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..

తిరుమల శ్రీవారి ఆస్థానం
---------------
తిరుమల ఆలయలో శ్రీనివాసుని ప్రక్కనే రజతమూరి శ్రీకృష్ణుని విగ్రహం పూజలందుకుంటూ ఉంటుంది. 11వ శతాబ్దానికి పూర్వమే కృష్ణమూర్తి విగ్రహం ఉన్నట్లు శాసనాధారాలు చెబుతున్నాయి.

కృష్ణాష్టమి సందర్భంగా సాయంత్రం సమయంలో శ్రీవారు ప్రత్యేకంగా కొలువుదీరుతారు. ఈ కొలువును 'గోకులాష్టమీ ఆస్థానం' అని వ్యవహరిస్తారు. సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి విచ్చేస్తారు. పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణావతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు. మరునాడు నాలుగు మాడ వీధుల్లో శిక్యోత్సవం (ఉట్ల పండుగ) కోలాహలంగా జరుగుతుంది. ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక. శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా క్రీ.శ.1545 సంవత్సరంలో తాళ్ళపాక వారే ఉట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అన్నమాచార్య కీర్తన
------------
తాళ్ళపాక అన్నమాచార్యుడు ఉట్ల పండుగను ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడు:

పైకొని చూడరె వుట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నే డిత డు

నడురేయి జనియించినా డు చూడ గదరే

అరుదై శ్రావణబహుళాష్టమి నా టి రాత్రి

తిరువవతారమందెను కృష్ణు డు

యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు

కరములందు బెట్టితే కడుసంతోసించెను
____________________________________________

ప్రేమను కాస్త అందిస్తే ప్రాణమే ఇస్తాడు...
భక్తి తో నువ్వు పూజిస్తే...
తాను భగవంతున్ని అని మరచిపోతాడు....
నల్లని రూపమున్నోడు...
మల్లేవంటి తెల్లని మనసున్నోడు...
మధురంగా పిలిస్తే పరవశించి....
మనసంతా నిండి పోతాడు....

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు....... 

No comments:

Post a Comment

Pages